పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము

805

"ఇటు వేగ పద” మని యెచ్చరించుచును
"భటులు రా లే" రని పతికిఁ జెప్పుచును
బెల్లుబ్బు దప్పిచే బెగ డొంది నడచి
యూళ్లలోఁ జొరఁబడి యుదక మానుచును
హయములు - మట్టించె నని డిగ్గి చనుచు
"రయమున రాదు వారణ మేల" యనుచుఁ
గురుసేన పోయినఁ గుంతినందనుఁడు
పరితోషమున మత్స్యపతిసూనుఁ జూచి
"మనకు గోవులు వచ్చె; మనము గెల్చితిమి;
మనచేత రారాజు మదము గోల్పడియె!
రయ మొప్ప దొరలు చీరలు దోఁపుపడిరి !
భయముతో వైచిరి పడగ లన్నియును!
మచ్చరింపఁగ నేల మరలింపు తేరు
వచ్చియుఁ దడ వయ్యె వాహంబు లల సె.
నీతల్లి ప్రజ లెల్ల నీ రాక కెదురు
చూతురు శంకింపఁ జూతు రింతకును;
నడపింపు మనుటయు నరనాథసుతుఁడు
తడయక పాండునందనుతేరు ద్రిప్పి
నలువు మీఱఁగ మత్స్యనగరమార్గమునఁ
నలయక వచ్చుచు నమరేంద్రసుతుఁడు