పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

302

ద్విపదభారతము.

భానుజుతల నున్న పచ్చనిపాగ
మానక తిగిచి క్రమ్మర ధీరు లైన
ద్రోణునికృపునిశిరో వేష్టనములు
జాణతనంబున స్సంధించి తెమ్ము.
హితపుణ్యుఁ డగుభీష్ముఁ డీయస్త్రమునకుఁ
బ్రతికృతి యెఱుఁగుమూర్ఛయుఁబొందకుండు.
అతనిఁ జేరకు" మన్న హరులపగ్గముల
నుతలీల సమ్మెట నొగలతో ముడిచి
యను వొప్పఁ బోయి వాఁ డవి యెల్లఁ దిగిచి
కొని వచ్చి నిలిచెఁ గ్రక్కునఁ దేరిమీఁద.
అట్టిద కాదె నాఁ డబలవస్త్రంబుఁ
బట్టినదోషంబు ప్రాపించె నృపుని !
తనరార నంత నుత్తరుఁ జూచి నరుఁడు
మన కింక రిపులసమ్మర్ధంబు వలదు
తురతుర మన తేరు దొలఁగింపు మనిన
సురనదీసూనుఁ డర్జును వచ్చి తాఁకి
"యెందుఁ బోయెద” వని యెలుఁ గెత్తి బాణ
సందోహములఁ గప్పి సంభ్రమించుటయు
"మీకు నేటికి రేఁగ మిగిలినయట్టి
చీకటి నిఁక" నంచుఁ జెలఁగి యర్జునుఁడు