పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము---ఆ -5

301

అలయక రిపుల రూ పణఁప నోపియును
దెలిసి పాండవులప్రతిజ్ఞ లూహించి
"పేర్చి వీరల భంగపెట్టదఁ గాని
చర్చింప నూరక చంపఁ బొ" మ్మనుచు
సమ్మదంబున మున్ను శుక్రుచేఁ గొన్న
సమ్మోహనాస్త్రంబు సంధించి మించి
సేనలఁ గలయ నీక్షించి యేయుటయు
మేనులు మఱచి భూమికి వ్రాలి తూలి
శరశరాసనములు జాఱంగ విడిచి
పరఁగ నిద్రలు వోవుపగిది నందఱును
నెట్టన వివశు లై నెఱి వింధ్య మాఁక
పెట్టినగతి నుండఁ బ్రీతుఁ డై నవ్వి
తనలోనఁ బ్రార్థుఁ డుత్తరమాటఁ దలఁచి
మనుజేంద్రసుతుఁ జూచి మక్కువఁ బలి కె

మూర్ఛిల్లినకురువీరుల శిరోవేష్టనముల నుత్తరుఁడు సంగ్రహించుట.


"ఉత్తర నీ వింక నుగ్ర సైన్యముల
హత్తినసొక్కు మాయక మున్నె కవిసి
నెలువుగా ద్రోణనందనసుయోధనుల
తలచుట్లు తిగిచి యెంతయు వేగమునను