పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము---ఆ -5

299

వచ్చితి; రే నొంటి వచ్చి తాఁకుటయు
విచ్చితి రిది చూడ వీరధర్మంబె ?
గజపురివీరవర్గము లెల్లఁ జూడ
గజముపై వచ్చుట గాదు కయ్యంబు !
తద్దయుఁ గై సేసి తగఁ గొల్వులోన
గద్దెపై నుండుట కాదు కయ్యంబు !
అస్తోకదివ్యగంధాకీర్ణ మైన
కుస్తూరిఁ బూయుట కాదు కయ్యంబు !
నంతోషమున రత్న సౌధంబులందుఁ
గాంతలఁ గూడుట కాదు కయ్యంబు !
ఏదిగాఁ జూచితి వీవు కయ్యంబు ?
జూద మాడిననాటిచూఱలు గలవె?
పొలు పొంద నీ కొక్కబుద్ధి చెప్పెదను
తొలఁగక నీవు మాతోడ మార్కొనుము;
ఏనును నినుఁ బట్టి యెల్లరుఁ జూడఁ
బీను గుఁ జేయుచోఁ బృథివీశ వినుము
ఎదురుగా వచ్చు దేవేంద్రలోకంబు !
చదు రొప్ప నందలిసౌఖ్యంబు మేలు ! !
అటుకానఁ బాఱిన నపకీర్తి నీకు ;
కుటిలవర్తన నిన్నుఁ గొల్తురే నృపులు?