పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

విరాటపర్వము

295


మేలు దుర్యోధన మేలు మే” లనుచు
జాల సంతోషించి శుక్రనందనుఁడు
అతఁడు వైచినశక్తి నవని పైఁ గూల్చి
మితి లేనిశీరముల మెఱసి వర్షించి
లాక్షాగృహంబు గాల్పఁగ నున్న పగయు
నక్షీణ కపటాత్ముడై యున్న పగయు
నుడ పక పాంచాలి నీడ్చినపగయు
నుడుగక పుట్టంబు లొల్చిన పగయు
నొక్కట సాధింప నుద్యోగ పడఁగం
గ్రక్కున నతని భాగ్యము కల్మి జేసి
ఘనుఁడు వికర్ణుండు కరిరాజు నెక్కి
తన వెంట రథములు తవిలి యే తేర
జలదంబు పై నున్న జంభారిపోలె
బలు తూపుగములను భార్డుఁ గప్పుచును
ఎడఁ జొచ్చి నిల్చి తా నెల్ల సేనలకు
గడు వేడ్క సేయుచో, గౌంతేయుఁ డలిగి
కాలదండముఁ బోలుకఱకునారసము
లీల సంధించి వాలినదృష్టి నిలిపి
తేరఁ గొప్పఁ దెగ నిడఁ దిగిచి యేయుటయుఁ
బరఁగంగ నది దంతిఫాలంబు నాటి