పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

ద్విపదభారతము.

బీభత్సుడు దుర్యోధనుని పై సాయకంబులు
పఱపీ పరిభవించుట.
సేనలు చెదర నాక్షితి భాగ మదర
భూనభోంతరము సద్భుతధూళి మునుఁగ
రా"రాజుపై వాఁడు రథము దోలుటయు
వారును మదిని దుర్వారకోపమున
బైపాటు సేయు చోఁ బార్ధుండు వారిఁ
బ్రా పైన తూపుల బాఱ దొలుచును
గురురాజుఁ దాఁకి వక్షోవీధియందు
సరవి నాటఁగ రెండు శరము లేయుటయు
మద ధార లొలి కెడుమదహస్తిపోలెఁ
గదలి నెత్తురు గాఱ గౌరవేశ్వరుఁడు
నోలిగా నెత్తురు లొలుక నర్జునుని
ఫొలమ్ము వా లమ్ము బరఁగ నాటించి
యొకరశ్మి మున్నుగా నుదయించుసూర్యు
సకలంక గతిఁ బొల్చునతని పై మఱియు
బొమముడి నెరయంగ భూరి బాణములు
శమనమహారాతిసము డౌ చుఁ బఱసి
యాతని బాణంబు లంతంత నఱకి
చాతుర్యమున నొక్క శక్తి వైచినను