పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

ద్విపదభారతము.

నని మర్మ మెత్తిన నతఁడు కోపించి
 నను గేలి గొనంగ మానఁగఁ జాల వకట.
ఇంకఁ దప్పక చూడు మిత నిసత్త్వంబు
బొంకు చేసెద నీవు బుద్ధిలో మేచ్చ”
ననుచు గా ధేయుఁ డాహపకాంక్షు డగుచుఁ
జనఁ జొచ్చె నతని పై సైన్యంబుతోడ.
క్రమఃరి యిటు వచ్చుఘన సేన నంత
నిమ్ముల జూచి దేవేంద్రనందనుఁడు
వెలయఁ బండిన చేను వృషభంబు సొచ్చు
పొలుపునఁ జొచ్చి యద్భుత లీల మెఱయ
సైరింప రానీయ స్తములు సంధించి
ధీరు డై శరము (దెంపఁ బూనుటయు
నతని బాహా శక్తి యంత కంతకును
వితత మై హెచ్చుట వీక్షించి సేన
పతికి లజ్జించిన బాలచందమున
ప్రతి చేష్ట చేయ నేరక యూర కుండె.
అంత గాండీవి కిట్లనియె నుత్తరుఁడు
 కౌంతేయ రమ్ము సంగ్రామమ్ము చాలు ;
ఇది యాదిగా నొక్క యేఁడు పోరినను
మదిలోన రణకాంక్ష మానదు నీకు !