పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ - 5

287

"మన మింక భీష్ముతో మార్కొన్న మేలు
ఘనతాళకేతువుఁ గంటివే యతని?
పనివడి యతనితోఁ బస చూప కున్నఁ
దనియదు హృదయ మింతటికయ్యమునకు.
వరుసఁ బగ్గంబులు వదలుగా విడిచి
హరుల వేగ మె తోలు మచ్చోటి" కనిన

నరునాజ్ఞ నుత్తరుఁడు భీష్మునెడకు రథంబు దోలుట.


నవనీశ తనయుండు నట్లు గా కనుచు
జవనాశ్వములమీఁద సమ్మెట వేసి
యరయ నూలును బట్టిన ట్లుండి నరుని
యరదంబుఁ దోలెఁ జయ్యన భీష్ముమీఁద.
అప్పు డర్జునునకు నాభీష్మునకును
ఒ ప్పార నతిఘోరయుద్ధంబు చెల్లె.
అందు గాంగేయుండు నాహవోత్సాహ
సందేహములు మాని శంఖ మొత్తుటయు
నతఁడును నొత్తె బ్రహ్మాండంబు లగల
ధృతి దేవదత్తంబు దేవదత్తంబు.
కౌర వేశ్వరుఁ డంత గాంగేయుఁ దొడరి
పోరాడి నరుఁ డోడి పోవుఁ బొమ్మనుచుఁ