పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

286

ద్విపదభారతము.

శరవహ్నిఁ గురియుమాంసంబుఁ గూరలును
దరతరం బగు నేత్రతతులు మీనములు
గాఁగఁ గైకొని భూతకాండంబు లచట
వీఁగ కెంతయువేడ్క విహరింపఁ దొడఁగె
బొనర యుద్ధము రణభూమిలో బలియ.
ఘనత గాంగేయుపైఁ గడఁకతో నరుగు
నెడఁ జొచ్చి వృషసేనుఁ డిషుపరంపరలు
బడలుపడంగ నా పార్థుపై గురియఁ
జతురుఁ డై నరుఁ డర్థ చంద్రబాణముల
నతనివిల్లును ద్రుంచి యైదుబాణముల
వక్షంబు నేయుచో వ్యాఘ్రంబుఁ గన్న
యుక్షంబుగతిఁ బాఱె నొగిఁ దేరు డిగ్గి,
అంత దుశ్శాసనుం డావికర్ణుండు
సంతతోద్ధతిని వింశతి దుర్ముఖుండు
వచ్చి తాఁకినఁ గ్రీడి వారిమర్మంబు
లుచ్చి పాఱఁగ నేసె నుగ్రబాణముల ;
నఱకె వర్మంబులు నఱకెఁ జాపములు ;
నఱకినఁ బాఱి రన్నరనాధసుతులు.
పాఱినఁ గని నవ్వి పాండునందనుఁడు
మీఱిన వేడ్క భూమింజయుఁ జూచి