పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ - 5

285

నడ తెంచు చున్న నున్నతిఁ బార్థుఁ డపుడు
పొడిపొడిగాఁ జేసి భూమి రాల్చుటయు
నరు నంత దేవదానవసిద్ధఖచర
నరులు కీర్తించిరి నానాముఖముల.
ఆకృపాచార్యుండు నట ద్రోణురథముఁ
జేకొని నిల్చె నొచ్చినవాఁడు గాన.
అప్పు డంతటివీఁరు డాచంద మైనఁ
గప్పినభీతిమైఁ గలసేన లెల్లఁ
జంద్రిక లెల్ల భాస్కరునకు వెఱచి
చంద్రుచెంతకు నేగుచందంబు దోఁప
మఱి పోయిగాంగేయుమఱుఁగు చొచ్చుటయు
నఱిమురి బీభత్సుఁ డంటంగఁ దఱిమి
సమరశంఖంబులు సమరకాహళులు
సమరభేరులు మ్రోఁగ సమరంబు చేసి
యొనరినశక్తిచే నురుశక్తి మెఱసి
మునుకొని మొత్తంబు మొన కంతఁ బొడిచి
యలరుచక్రంబుల నరిచక్ర మణఁచె,
బలిమిబాణంబుల బ్రద్ద లై పగిలి
పడి యున్న పునకలు పానపాత్రములు
మడపక రుధిరంబు మదిరారసంబు