పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము----ఆ -5

273

అరయ శౌర్యము నీకు నభివృద్ధి చెందెఁ
గరము నిర్భర మైనఘన తేజ మొప్పె!
ఇటు లెక్కు డగులావు నే నెందుఁ జూడ
నటమటించెను జిత్త మాలంబునందు;
సారథికార్యంబు సాధింపఁ జాల.
వారక చేష్టలు పాసె నెమ్మేను
భీతిమై నిండా రె విహ్వలభావ
మేతీరునను బుద్ధి యెలమిమై నిలువ ”
దనిన భూమింజయు నాక్రీడి చూచి
"వినుము వేసఱ నేల వీరకార్యముల
కే నున్న వాఁడ నీ కేల చింతింప ?
ఫూని యశ్వంబుల బోధించి నడుపు ;
మరుణాశ్వములతోడియరదంబుమీఁద
గురుఁ డున్న వాఁడు చూడ్కుల నిల్పు మచట;
నురుకంధరమును మహోల్లాసముఖముఁ
బర పైనయురమును బాహుదీర్ఘతయుఁ
గలిగినపుణ్యుఁ డాగమశాస్త్ర విదుఁడు.
చెలువార విలువిద్యఁ జెప్పె మా కితఁడు.
క్షత్రియగోత్రసంజాతదోషమునఁ
జిత్ర మీతని నేను జెనకంగ వలసె !