పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

272

ద్విపద భారతము

క్రీడి యరదంబు ద్రోణు నెడకుం దోల నుత్తరున కాజ్ఞాపించుట.

పాఱిన వైరాటి పక పక నవ్వె;
మీఱిశంఖముమ్రోఁత మొరయించె నరుఁడు.
పొగడిరి సుర లెల్ల బోరున మునులు
పొగడిరి క్రీడిఁ దుంబురునారదులును.
తివిరిసరణకాంక్ష తిర మైన నతఁడు
తవిలి నల్గడలను దవ్వు వీక్షించి
"అరదంబు గురునిపై నరుగ ని" మ్మనుచు
నరనాధసుతున కున్నతిఁ జెప్పుటయును
నొగిలి సమ్మెటకోల నొగలపై నతఁడు
డిగ వైచి భీతి రెట్టింప నిట్లనియె:
"అమ్మక్క ! ఇంక నే మైనఁ గానిమ్ము
నెమ్మి నెవ్వం డోపు నీ తేరు గడప!
తురగయూథముమీఁదఁ దోలి వేసఱితిఁ
గరిసమూహముమీఁదఁ గడపి వేసఱితిఁ
దల మీఱి దొరలపైఁ దఱిమి వేసఱితి
బలియురపై నెల్లఁ బఱపి వేసఱితి.
తుద యేది మొద లేది దురము సేయుటకు?
ఇదె నీకు భుజసార మెక్కు చున్నదియ!