పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము----ఆ -5

271

పొలు పైనభూధరంబులఁ బోలుకరుల
బలుపిడుఁగులఁ బోనిబాణంబు లేసి
యిలఁ గూల్చునంతలో నినతనూభవుఁడు
వెలయంగ వేఱొకవిల్లు సంధించి
యాఱింట నుత్తరు నాఱింట హరుల
నాఱింట రథముఁ బదాఱింటఁ బడగ
నరుమేన డెబ్బదినాల్గుబాణముల
వరుసతో నాటి భూవరుని మెప్పించె.
నరుఁడు కర్ణుని నేసె నరుఁ గర్ణుఁ డే సె;
ఇరువురుఁ బోరాడి రి ట్లొక్క రీతి.
అప్పుడు కౌంతేయుఁ డలుక దీపింపఁ
దప్పక వీనితోఁ దడ వయ్యె ననుచు
కడఁగి నన్నూరువ్రేఁక పునారసములు
తొడిగి రాధేయు బంధురకంధరమునఁ
గరములఁ బార్శ్వభాగముల ఫాలమున
నురమున రక్తంబు లొలుక నేయుటయు
మతి గిట్టి నెసఁ గిట్టి మార్తాండుపట్టి
ధృతి గట్టి పెట్టి భీతిలి ముట్టఁ బాఱె.