పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

266

ద్విపదభారతము.

ఇత్తెఱంగునఁ బాఱ నెలమి సంగ్రామ
జిత్తు తాఁ బోవక జిష్ణుపైఁ గవిసి
మునుమిడిఁ గర్తరీముఖకూ ర్మసఖము
లనుసాయకము లేయ నతఁడు నవ్వుచును
దల మీఱి వాని కేతనముఁ జాపంబుఁ
దలయును ద్రుంచి యాతలఁ బాఱ వైచె.

కర్ణుండు పరాక్రమించి భీభత్సునిపయిం గవియుట.


ఈచందమునఁ దమ్ముఁ డిలమీఁదఁ బడినఁ
జూచి యాగ్రహమును జోద్యంబు నెరయ
నుడికెడినేతిలో నుదకంబు వడిన
వడువునఁ జెల రేఁగి బలిమిఁ గర్ణుండు
దివిజేంద్రసుతుమీఁదఁ దేరు దోలించి
వివిధ బాణంబుల వెస నేసి యేసి
రథికు నొప్పించి సారథిఁ జిక్కు పఱిచి
రథరథ్య కేతుమర్మంబులు నాటి
బలిమి పాటింప నాపార్థుండు కినిసి
బలునారసంబులు వైరిసంత్రాస
కరదర్పపరిణతిఁ గర్ణుపైఁ గురిసె
వరభండనోద్దామపటు కేళి సలిపె.