పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము-ఆ-5

265

అంత వికర్ణుఁ డత్యంతవేగమునఁ
గౌంతేయుమీఁద మార్గణవృష్టిఁ గురియ
నఱిముఱిఁ దనచాప మతనిబాణముల
విఱుగంగఁ దానును విఱుగుచో వీరు
"లెసఁగి పోవకు" మని యెంత చెప్పినను
వెస వికర్ణుఁడు కాన విన లేక పాఱె.
క్రూరుఁ డై యవుడు శత్రుంతపం డార్చి
నా రాచతతుల నన్నరు తేరు మాటి
యుత్తరుఁ జంప నుద్యోగించి యపుడు
చిత్తవిక్షేపంబు సేయుచో నరుఁడు
వానిసూతునిఁ జంపి వానివి ల్విఱిచి
వానిరథ్యంబుల వసుధపైఁ జమరి
చెలఁగి యాయా హవక్షేత్రపాలునకు
బలి యిచ్చె మఱి వానిపటుమస్తకంబు.
ఇచ్చి యంతటఁ బోక యీకుమారకులు
విచ్చి పాఱినఁ గాని విభుఁడు రాఁ డనుచు
దృష్టించి యరు దైనదివ్య బాణముల
సృష్టిఁ జీఁకటిఁ బడఁ జేసీ యేసినను
తనికినదిగులుచే ధైర్యంబు వదలి
యనిఁ దొలంగుచుఁ బాఱి రరియోధవరులు.