పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము-ఆ-5

263

నుత్తరునకు వారియుత్సాహ మెల్ల
నత్తఱిఁ జూపుచు నర్జునుం డనియె :
"కురురాజు గూర్చినఘోటకవితతి
పరిణద్ధసైన్యవైభవముఁ జూచితివె?
ఎలమితో మన మెంత యేపు సూపినను
బలము దగ్గక వైరివర్గంబు పొలుచు !
ఇటమీఁద మనము ప్రత్యేక యుద్ధమునఁ
బటుభయంకరలీల బటువు చూపుదము.
నెఱయ నించుక నీవు నీరథ్యములను
దఱుమక నిల్పి కంథర మప్పళింపు.
జూ నొప్పఁ జూతము సైన్యమధ్యమునఁ
గాన వచ్చుచు నుండుఁ గర్ణు కేతనము.
వాఁడు మార్కొన నున్న వాఁ డింక మనకు
వాఁడిమి పచరింప వలయు మున్నాడి.
ఆదిక్కునకుఁ జేర నరదంబు పఱపు
మాదిత్యతనయునియా టోప మెల్ల
నుడిగింతు" నని పల్క నుత్తరుం డపుడు
కడుకొని హరులపగ్గము సడల్పుచును
రథము వేగమె తోలె రాధేయుమీఁద.
ప్రథిత బాహాగర్వపరివేష్టుఁ డగుచు