పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

ద్విపదభారతము.

అర్జునునకు నిలువ లేక పాఱు సైన్యంబునకు భీష్ముఁ డుత్సాహవచనంబులు పలుకుట.

"ఓకర్ణుసైన్యంబ, యోద్రోణుసేన,
ఓకృపుసైన్యంబ, 'యోడకుం" డనుచుఁ
“గ్రమము సర్వము మీఱి కాలాగ్ని రాదు,
రమణతో జలధి మేరకు మీఱి రాదు,
గఱకంటు మెడ నున్న గరళంబు రాదు,
తెఱఁ గొప్ప శమనుఁ డుద్రేకించి రాఁడు !
ఒకవింటివానికి నోడి వచ్చితిరి !
ప్రకటింపఁ దల్లిగర్భముఁ జొచ్చు వారె!
మెఱయు విండ్లును గావె మీరు పట్టినవి ?
మెఱయు తేరులు గావె మీర లెక్కినవి ?
ఎలమి నెంతటి కైన నే నున్న వాఁడఁ
దలపడి మీర లుధ్ధతి నేయుఁ" డనిన
నీసున నటు పోక యేచి యార్చుచును
భాసురగతి భూమిపైఁ ద్రొక్కి నిలిచి
మఱియుఁ గవ్వడిమీఁద మహితసత్త్వంబు
నెఱప నుద్యోగించె నెఱి సైన్యవితతి.
అటు లేచువైరులయాటోప మెల్లఁ
బటుకార్యగతిఁ జూచి బాహు లుప్పొంగ