పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము-ఆ-5

261

కలుషించి యేయుచోఁ గలశసంభవుని
నలు వొప్ప డెబ్బది నాటె బాణములుఁ
బరఁగ దుశ్శాసనుఁ బదియేను నాటెఁ
బరఁగంగ దుష్ప్రభుఁ బండ్రెండు నాటె
నలు వొప్ప నలుబది నాటె సౌబలునిఁ
నలరంగ ముప్పది యాకృపు నాటె.
కర్ణురథ్యంబులుఁ గర్ణుసారథియుఁ
గర్ణు తేరును ద్రుంచి కర్ణు నొప్పించి
ధీరుఁ డై నరుఁ డంత దేవదత్తంబు
పూరించె సైన్యంబు భుజశక్తి నెడల.
దొర లిట్లు వడుటయుఁ దొడరి వీక్షించి
వరుస నిల్వఁగ లేక పాఱె సైన్యంబు
సేనానిచే దైత్య సేనలు తొలి
జూ నొప్పఁ బాఱినచందంబు దోఁప;
సుర రాజసుతుమూర్తిఁ జూడంగ వెఱచి
మరలి గాంగేయునిమరుగు సొచ్చినను
అతఁడు వారల కెల్ల నభయహస్తంబు
చతురత నిచ్చి యాశ్వాసించి పలికె: