పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

ద్విపదభారతము.

గలుగుచు సంగరాంగణము చూడ్కు లకు
విలయకాలమునాఁటివిభవంబు చూపె
కాలినశిఖిఁ జొచ్చి కనకఖండములు
కాలుష్యములు మాని కడు నొప్పినట్టు
లనిఁ జొచ్చి విరథు లై యర్జునాస్త్రములు
మనుజభావము లూడ్చి మఱి దివ్యు లగుచు
రమణతోఁ గొందఱు రంభ కౌఁగిటను
గ్రమముతోఁ గొంద ఱుర్వశిసౌధములను
మెలపుతోఁ గొందఱు మేనకయింటఁ
దలఁపఁ గొందఱు తిలోత్తమయింటఁ గాఁగ
నలవక యింటివేశ్యల పాలు పోక
తలకొని ఘోర యుద్ధము చేసి రచట.
అప్పుడు క్రీడిచే నాభంగి సేన
చెప్పఁ జూపఁగ లేక శీఘ్రంబె తెగిన
నతిరథసమరథు లట మహారథులు
ధృతి నర్థరథులు నుద్రేకంబుతోడఁ
బరఁగ నర్జునుఁ డనుబడబాగ్ని మీఁదఁ
బొరిఁ బొరి శరవార్ధిఁ బురికొల్పుటయును
అది వీక సేయక హరితనూభవుఁడు
త్రిదశు లిచ్చినయట్టిదివ్యబాణములు