పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము-ఆ-5

259

నెలకొని యడ్డంబు నిడుపు మూలలను
వలయంబులును గాఁగ వచ్చి నర్తింప.
నరుని బాణముల రత్నపుఁ గేతనములు
ధరఁ గూలెఁ జుక్క. లుద్ధతిఁ గూలినట్లు,
“మముఁగావు"మనిమ్రొక్కుమాడ్కినశ్వములు
నమరేంద్రసుతబాణహతిఁ జేసి మ్రొగ్గె.
రక్తాబ్ధిలోన వారణపయోదములు
యుక్తంబుగాఁ గూలె నొకక్రీడిచేత.
పడగలు గొడుగులు పార్థుబాణములఁ
గడు వేగమునఁ ద్రెవ్వి గాలిచే నెగ సె
నటమున్నె దివి కేగి యాడునట్టులును
జటులభూపాలలాంఛనములో యసఁగ !
కొలఁది మీఱినయట్టిఘోర యుద్ధంబు
చెలఁగఁ గౌరవరాజు సేనలో నపుడు
మద మేది కూలినమాతంగఘటలు
చిదిసినహరులు నొచ్చినరథావళులు
నొరగిన కేతువు లొరగుసారథులు
విరిగినవిండ్లుఁ ద్రెవ్వినగుండియలును
దునిసినగోళ్లును దొరఁగు నెత్తురును
బెనఁగొన్న ప్రేవులు బెరయుపీనుఁగులుఁ