పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -౧.


ఆయేఁడు మీ కింక నజ్ఞాతవాస
మై యుండువేళకు నర్థిలో వచ్చుఁ,
బొ మ్మన్న వచ్చితి ; భూపాల నాకు
నిమ్ముగా ని ట్లుండ నిది వేళ యయ్యె
ధర బృహన్నలపేరు ధరియించి మించి
వెర వొప్పఁ బేఁడి నై విహరించువాఁడ.
ఏయునప్పుడు నాకి యిరుగేలఁ దాఁకి
కాయ కాచినపట్లు కానరా కుండ
సంకులు దాల్చి యాజాను బాహువుల
నంకించి ఱవిక చే నందంబు మాన్చి
ధృతి నాటయొజ్జ నై తెల్లంబు గాఁగ
నతనికన్నియలకు నాట నేర్పుదును.
జనపతి నన్ను నెచ్చటివాఁడ వనిన
విను కృష్ణయింటను విహరింతు నందు "
అనవుడు నది యొప్పు నని ధర్మరాజు
ననిచినవగ దోఁప నకులు నీక్షించి
"వీనిసౌందర్యంబు విశ్వమోహనము,
వీనిచారిత్రంబు విశ్వసంస్తుతము,
వినుతింపఁగా రాదు వినయసంపదలు.
వినుతింపఁగా రాదు వీర్యాతిశయము.