పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము-ఆ-రా

253

ఈరీతి నవ్వీరు లేవురు నడవ
ధారుణీవిభుఁ డంతఁ దానుఁ దమ్ములును

కురువీరులు దర్పంబునఁ చేర్చి యొక్కుమ్మడి నర్జునుం దలపడుట.'


శకునిసైంధవముఖ్యసకలబాంధవులుఁ
బ్రకటబాహ్లిక ముఖ్య బహుమహీవిభులు
సకలకుంజరములు సకలాశ్వతతులుఁ
నకలంకగతి బీర మభివృద్ధి చెందఁ
గూడి యొక్కటఁ బేర్చి ఘోరాహవమునఁ
గ్రీడిఁ దాఁకినఁ బ్రాఁకెఁ గెందూళి మింట,
గజగజ వణఁకె దిగ్గజము లన్నియును,
త్రిజగము ల్గలఁగె వారిధు లెల్ల నింకె,
పటహభాంరవములఁ బగిలె నల్దెసలు,
పటు బాణరుచులచే భానుండు మాసె,
"హాపుత్త్ర హాపుత్త్ర” యని వజ్రి పలికె
రూపింపఁ బాండుపుత్త్రునిలావు మించె.
అప్పుడు తఱచుగా నవనీరుహములు
గప్పినశిఖి పోలె గాండీవధరుఁడు
నిర వొప్ప బాణంబు లీసుమైఁ గురిసి
యరుల మార్కొనుచు బాహాటోప మొప్ప