పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

ద్విపదభారతము.

ఆశ్వత్థామ కేరడంబు లాడఁ గర్ణుఁడు వీరభాషణంబు లాడుట.


“కర్ణ నీమాట లాకర్ణించె నృపుఁడు
నిర్ణయించితి క్రీడి నిర్జింతు ననుచు.
అదె వచ్చె బీభత్సుఁ డాహవంబునకు !
ఎదు రేగి పోరాడ విది యేమి నేఁడు
తలకొని వానితో ? తలపోసి చూడు,
తలఁప నిందఱు గారె తలపోయఁ బతికి
పలుక నేర్తురు గాని పలికిన ట్లేల
యిల నారు చేసిన నే మేమి గాదు!"
అనుటయుఁ గోపించి యర్క నందనుఁడు
పెనుపునఁ బడగెత్తు పెనుపాము వోలె
నిట్లని పల్కె "నే నెట్టు లాడితినొ
యట్లె చేయుదుఁ జూడు మాలంబులోన.
నిను నమ్మి వచ్చితినే కయ్యమునకు ?
విను నీవు నన్ను నవ్విన నేమి యయ్యె!
బీభత్సు నిదె యడ్డ పెట్టెద" ననుచు
నాభోగశరవేగుఁ డై త్రోచి నడవ
నతనికి మున్ను భీష్మాచార్యకృపులు
చతురు లై నడచి రశ్వత్థామతోడ.