పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము-ఆ-రా

251

రారాజు మార్కొన రా కున్న వాని
తేరుచేరువఁ బోవఁ దెలివితోఁ జొరుము.
ఇంక భీష్మునిఁ జూడు మితఁ డా జిభీష్ముఁ
డింకించు నరిబలం బేచి యెల్లెడల;
సంచితభుజబలసంపన్నుఁ డీతఁ
డంచితగాంభీర్యుఁ డసమసాహసుఁడు
పరశురాముని లావుఁ బరఁగ నిర్జించె ;
మరు కేళి హనుమంతుమాడ్కి వర్జించె.
తలపోయఁ బాండవధా ర్తరాష్ట్రులకు
నెలమిమై నొకరీతి నే కార్యమునను
భేద మించుక లేక పిల్చి తా నెప్పుడు
నాదరించును గూర్మి యలరార నితఁడు.
ఇతనిపొంతను బోవనీకుమా రథము
జితలోకుఁ డితఁడు నిర్జింప నీఁ డరుల"
అని మహావీరుల నతని కేర్పఱిచి
యని సేయ నర్జునుం డరుదెంచునప్పు
డెలమి నశ్వత్థామ యించుక నవ్వి
పలికెఁ గర్ణునిఁ జూచి భావంబు చెదర :