పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

ద్విపదభారతము.

ఈయిరువురు నేయ కే నేయ వెఱతు
మాయెడఁ గృప గల్గు మాన్యు లెంతయును
అదె చూడు రాధేయుఁ డాహవ వక్షోణి
గదల కుండెడీ మేటి గర్వపర్వతము.
ఇతఁ డర్టికోటికి నిచ్చు కాంచనము
ద్రుతగతి రెండు మేరువు లంత గలదు.
కురురాజు వీడు న ఘోరాజి గెల్చు
నరుదార సంచుఁ దా నాత్మ లోఁ దలంచు.
వీక్షింపు కౌర పవిభుఁ డల్ల వాఁడె
యక్షీణుఁ డభిమాని యసమానబలుఁడు.
బలిమిఁ బాండవులను వారక యేఁపఁ
గలిగె నాకని గము గవిసి యున్నాడు.
కలిగే నీతనితోడఁ గయ్యంబు నాకు
గలిగే బండువు సేయ గాండీవమునకు !
అర్క సూనుఁడు నీతఁ డని నన్నుఁ గన్న
మార్కోనఁ గలవారు మది గొంకు లేక!
ఎలమితో వీరల నే నేయునపుడు
సొలవక నీ నేర్పు సూపంగ వలయు.
సీడుఁ గైన నిల్చు నా పేరు 'సెప్పీనను
బుడమి పై వీరి నిల్చుట యెంత నాకు ?