పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

248

ద్విపదభారతము.


ఉత్తరునకు నర్జునుఁడు కౌరవవీరులను వారియడియాలంబులను దెలుపుట.

యుత్తరు వీక్షించి యొప్పారఁ బలికె:
"ఉత్తర చూచితే యుగ్రసైన్యముల
నర్థితో వైరు లిట్లరుదెంచు టెల్ల ?
పార్థునోఁచిననోముఫలము కాఁ బోలు !
కురువీరవరులకు గుఱుతు చెప్పెదను
వెర వొప్ప నది నీవు విని యుండ వలయు.
పసిఁడిఁ జేసినవేగిపగిది యై పడగ
యసమానగతి నొప్పునతఁడు ద్రోణుండు.
శృంగార మై యున్న సింగంపుఁబడగ
యంగీకరించువాఁ డతనినందనుఁడు.
పసిఁడియాఁబోతును బడగలోఁ గల్గు
నసమాక్షసమరూపుఁ డగువాఁడు కృపుఁడు.
ఉడురాజు సరిపోలు చున్న శంఖంబు
పడగఁ దాఁ గలవాఁడు భానునందనుఁడు.
పడగలలోఁ గానఁబడుత్రాటిమ్రాని
పడగఁ దాఁ గలవాఁడు పరఁగ భీష్ముండు.
సర్పంబుఁ దానును సరివచ్చు చుంట
సర్ప కేతువువాఁడు సరవి రారాజు.