పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


అనపుడు నది పోలు నని ధర్మరాజు
ఒనర నర్జునుఁ జూచి యుత్తలంబునను
" అర్జున, నీదులా వరిది చెప్పంగ
నిర్ణరాధిపుఁ డైన నిను గెల్వ లేఁడు.
కాలకేయులఁ జంపి ఖాండవం బేర్చి
శూలి నెక్కటి గెల్వ శూరు లున్నారె!
ఇంతవాఁడవు నీవ దెట్లొకో యింక
వింతలాగున బోయి విరటుఁ గొల్చెదవు ?”
అనిన ధర్మజుతోడ సమరేంద్రసుతుఁడు
తనకుఁ బొం దగురీతిఁ దాఁ జెప్పఁ దొడఁగె 7:
« అమరంగ నేను గా ర్యార్థినై తొల్లి
అమరావతికిఁ బోవ నం దొక్క నాఁడు
నలినాక్షి యుర్వశి నన్నుఁ గామించి
పిలిచినఁ బో నైతిఁ బ్రియముఁ గైకొనక;
అప్పుడు కోపించి హరిమధ్య నన్ను
దప్పక పేఁడి వై తగ నుండు మనుచు
శాపించి పోయిన జననాథ వినుము
నాపాలఁ గృప గల్గి నా కేశుఁ డెఱిఁగి
యేపాట నీకును నీ పేఁడితనము
ప్రాపించి యొకయేఁడు పఱిచి పోఁ గలదు.