పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము___ఆ-౫.

247

౫.

"యమ్మహీపతిమీఁద నరదంబుఁ బోవ
ని” మ్మని నృపసూతి కేర్పరించుటయుఁ
బ్రధితకౌరవులు నేర్పడ రెండువేల
రథములవారు ధీరత మున్నె కడఁగి
వేయేసిరథముల వెసఁ గర్ణ భీష్ము
లాయత్త మై వచ్చి రతని కడ్డంబు.
నరనాధుఁ డటమున్నె నరునిచేఁ బనులు
తిరుగుట వీక్షించి దీనభావమున
రాయుచు ననుజవర్గముఁ దాను మగిడి
వేయురథములతో వెఱఁ గంది నిలిచె.
తక్క టిబలము లుధ్ధతి మోహరించి
రెక్కడఁ జూచిన నిల యీనినట్లు,
ఇందఱు నొకనిపై నింత సేయుచును
అం దందు నే కాంగి కను వైనయట్లు
దర్పించి ననుఁ జూడు తనుఁ జూడు మనుచు
నేర్పులు దొరలతో నిర్ణయించుచును
ఉదయించుభాస్కరు నుగ్రరాక్షసులు
పొదివినగతిఁ గ్రీడిఁ బొదువునత్తఱిని
అతఁడు మోమున మందహాసంబు నిగుడ
నతివీర రసవార్థి నందంద తేలి