పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

ద్విపద భారతము.



పసులతోడన పట్టుపడినగోపకులు
వెస నేగి రాధేనువితవి వె న్దగిలి..
అనఘుఁ డర్జునుఁడు తానాహవోత్సాహ
మొనర మూఁపులు పొంగ నుత్తరుఁ జూచి
"అరులు గోవుల కింత నడ్డంబు రాక
యరదంబు వారలు నరు దెంచు నెడకుఁ
బోవ ని" మ్మని చెప్పి భుజదండ మెత్తి
గోవులదెసఁ జూపి గోపవర్గముల
“నోడకుఁ డింక నే నున్నాఁడఁ బనులఁ
గూడి పొం" డని చెప్పే కొమ రొప్ప నంత
వెరవునఁ దేనె గప్పినమక్షికముల
పరుసునఁ గురుసేన పసులకై పొదువ
వెమ్ముచుఁ గోపించి వెసఁ జొర రాక
యమ్ములు పఱచి బాహాశక్తి నతఁడు
భావనకై వచ్చు బహువికారములఁ
బోవఁ ద్రోచిన యోగిపురుషుండు పోలె
వారించుటయు సేన వశము గా కుండె,
చేరె గోవులు తొంటిసీమ కన్ని యును.
అనినఁ గౌరవు లెల్ల నటమీఁద నేమి
యొనరించి రది తెల్పు మొనరంగ ననిన