పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము---ఆ-4

243

మొదవుల వెంట నిమ్ములఁ బోవుప్రజల
నదలించి తూర్పునకై పాఱఁ దోలి
తెఱపి గావించినఁ దేఱఁ గొప్పెఁ జూడఁ
దఱ చైనగోవు లాతత సేననడుమఁ
దునిసిన మొయిలుసందునఁ గానఁబడిన
ఘన మైసశతతారకములచందమున.
భవ్యదోస్సారంబు భాసిల్ల విలిచి
సవ్యసాచియు నంత సవరించి యొత్తె
దివ్యశంఖంబు భూదిశలు ఘూర్ణిల్ల
సవ్యయం బగుదానియారవంబునకు
హరి కేతనము సేయునార్భటంబునకు
హరి కేతుభూతాట్టహాసంబునకును
శోభిల్లుమకుటరోచుల తీవ్రతకును
నాభీలగాండివజ్యానాదమునకు
నరిసేన సేయుహాహారవంబులకు
నురవడి సేయుదివ్యుల యెలుంగులకు
బెదరి గోవులమూఁక పృథవి గంపింపఁ
జెదరి గాండీవి వచ్చినజాడఁ బట్టి
చిఱుకొట్టుచును వాలశిఖరంబు లె!
పఱచె దక్షిణదిశా భాగంబునకును;