పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

242

ద్విపద భారతము.

"చేకొని కూడ వచ్చితిమి గోవులను
వీకతోఁ బఱ తెంచె వెనుక సైన్యంబు.
సరగున నరదంబు సైన్యమధ్యమున
నరుదార నడపు; బాహాశక్తి నేను
త్రిప్పుదుఁ బసులను దీవ్రత రిఫులఁ
గప్పుదు శరవృష్టిఁ గలఁతు భూనాధు"
ననిన నా సేనకు నడ్డంబు నడప
మునుమిడిఁ దూరుపుముఖముగా రథము

కౌరవపరివేష్టితము లైనగోవులనెల్ల నరుఁడు విడిపించుట.


జననాధతనయుండు చన నిచ్చుటయును
దనపేరు వాడి సుత్రామనందనుఁడు
పాతాళలోకంబు బబ్బరింపంగ
నాతఱి రథఘోష మందంద నెఱపి
యెలమితో "నెందుఁ బోయెదరు, పో నౌ నె?
నిలుఁ" డని చే వీచి నిష్ఠురా స్త్రములఁ
జెన్నుగా సేనలు చెదరంగ నేసి
మిన్ను నేలయుఁ గప్పి మెఱసి యార్చుటయు
వెఱచి తప్పక చూడ వెఱచి చేష్టలను
మఱచి యుండిరి; క్రీడి మహితవేగమున