పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

ద్విపదభారతము

అర్జునుఁ డుత్తరునకుఁ గురుసేన యున్నవిధంబుఁ దెలుపుట.

"వెరవక కురుసేన వే చూడు; మొనలు
తిరిగి పోయెడిఁ జూడు తెఱఁగు లై; చూడు
మీవలిపౌఁజు; ని దెంతయు ఘనము.
భావింప నడుమ నల్పంబు సైన్యంబు.
ముందఱ నల్లదె మొత్త మౌసేన.
ఎం దున్న వాఁడొకో యీకురువిభుండు ?
తడయక యతనిఁ జూతముగాని తేరు
నడపుదు కాని సేనకు దాపలింపు
మజుఁ డడ్డ మగునేని హరుఁ డడ్డ మైన
నిజబాణతతులచే నిర్జింతు విడువ.
అంతట సేనక న్నది కన్న వంక
నెంతయుఁ బస చెడు నితఁడు చిక్కి నను.
ఈ పౌఁజులోపల నితఁడు లేకున్న
వే పోయి గోవుల విడిపింప వచ్చు.
అక్కడ రొద సేయ నపు డైన దాయ
చిక్కక పోఁ" డంచుఁ జిత్రంబుగాను
నరుఁడు చెప్పినయంత నరనాధసుతుఁడు
నరదంబు నడపింప నపుడు సైన్యముల