పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము---ఆ-4

237

వీక్షించు చుస్న చో విజయుఁ డారీతి
నక్షీణశత్రు సైన్యములతోఁ గదిసి
కొలఁది మీఱినదైత్యకోటులమీఁద
బలశీలుఁ డై పోవుబలభేది పోలె
తడయక బహుపయోధరపంక్తిమీఁద
వడిఁ గూడి చనుగంధవాహుండు పోలె
నతిధీరగాండివజ్యూనినాదంబు
ప్రతిపక్షులకుఁ బ్రాణభయము సేయఁగను
దరమిడి దేవదత్తంబు పూరించి
కురుసేనగుండెలు గుద్దలించుచును
కపి కేతనజ్వాల కబళించి విడువ
నృపులచిత్తంబులు నీఱు చేయుచును
"ఏయుఁడు చూడఁగా నిటు రాక పోడు
వ్రేయుఁ" డంచును గురువీరులార్వఁగను
మెఱసినమింటఁ గ్రొమ్మెఱుఁగుచందమున
మిఱుమిట్లు గొనఁ దేరు మెఱసి యే తేర
దళములఁ గ్రోశమాత్రంబులోఁ గూడి
తల యెత్తి చూచి యుత్తరున కిట్లనియె: