పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

ద్విపదభారతము


డెలనవ్వు చెలువార నీకొని యఫుడు
బలము భూవిభునకు భాగించి యిచ్చి
వెనుక నుజ్జ్వ్యల సైన్యవిసరంబు మెజయ
మొన నేయ నపుడు నిమ్ముల ద్రోణు నడుమ
దలకొని కర్ణు దుశ్శాసన ద్రౌణి
వలపలితల నిల్పి వరుస న్వెబ్లైడల
శకునివికర్ణదుశ్శాసన ద్రౌణి
శుక బాహ్లికాదు లౌశూరపుంగవులం
దనర నిల్వగ బంచి తా నందఱకును
వెనుక యైసన్నాహ విభవంబు మెఱసి
పరికింపం దగుతాటిపడగ యొత్తించి
యరుగుఛు నుండె దూర్యములు ఘోషింప
అంత నింద్రుండు దివ్య మగువిమానమున
నంతరిక్షంబున నరుదెంచి నిల్చి
సరసులైసురలు ఖేచరులుం గిన్నరులు
గరుడగంధర్వులుం గర మర్ధి గొలువం
జక్రి'ప్రాపున గాల చక్రంబు గెలుచు
చక్రవర్తులు రాజచక్రంబు గొలువ
నీ మహారథులతో నితం డొంటిం దాకి
యేమి సేయంగ నోపు నిది చోద్య మనుచు