పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము---ఆ-4

235

నలవడఁ గ్రీడితో నడరి యుద్ధంబు
చెలువారఁ జేయుదు సిద్ధ మీపలుకు.
సంధిమాటలు మీరు సంధింప రాదు
బంధుత్వమున రాజ్యభాగ మే నీను.
పోరాడఁ దొడఁగుదు భుజశక్తి" ననియె.
ఆరీతి నృపుఁ డాడ నాచార్యుఁ డనియె:
"రాజునకంటె సంగ్రామకార్యంబు
భూజనులకు నేరఁ బోల దె ట్లయిన.
ఏ నెఱింగినయంత నేర్పరించెదను.
సేన నాలనపాలు సేవింప నృపుఁడు
మున్నాడి పోయిన మొగి నంత సేన
వెన్నాడుకదుపుల వెసఁ జుట్టి చనును.
తక్కటిసగముతోఁ దగ మోహరించి
యుక్కు మైఁ జన నొప్పు నొయ్యన మనకు.
వెనుకొనిపోవ నవ్విభుఁడు గోవులను
మనభూమిఁ జొచ్చు నెమ్మది నీక్షణంబె.
నానాముఖంబుల నరుఁడు వచ్చినను
సేనకు నడ్డంబు సేయ మే ల" నిన
నెలమితోఁ గర్ణుండు నిదియె మే” లనియె.
అలద్రోణుమాటల నాలించి భీష్ముఁ