పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము---ఆ-4

231

చేకొని మారాజుసిరి యడ్డ మింత
లేక భోగించితి లీలతో నీవు
కుడిచినదానికిఁ గొదవ లే దెందు.
వెడలు మిచ్చటఁ బాసి వివిధయజ్ఞములఁ
గుడిచి నెమ్మది నుండు ; ఘోరాజి యేల
బడుగుబాఁపడ నీకు; పతి సంతసింప
నేను విల్లందిన నింద్రాదిసురల
నైనను విదళింతు నాపార్థుఁ డెంత ?"
అనిన భీష్మాచార్యు లతనిమాటలకు
మనసునఁ గోపించి మనుజేంద్రుఁ జూచి
"కలశజుపలు కొప్పు గలశజత్మజుని
పలుకును మేలు తప్పక పల్కెఁ గృపుఁడు.
కర్ణుండు తనదుసంగ్రామపాటవము
నిర్ణయించును గాక నృపునికట్టెదుటఁ
దగిలి కోపించి పెద్దల ధిక్కరింపఁ
దగదు; నీకును వినఁ దగదు; వారింపు ;
మేకాంగిఁ దలపడి యెలమి రర్జునుని
భీక రాకృతిఁ బేర్చు బిరుదువాఁ డైన
నరనాధుచేత మన్ననఁ బొందుఁ గాక.
పరనింద లాడి పాపముఁ బొంద నేల !