పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

ద్విపదభారతము.

ధరణీశ చెనఁటిజూదము నేరనట్టి
గురుఁ డేల కృపుఁ డేల కురురాజ నీకు ?
అదియును నిఁక నేల : యఖిలపాండవులుఁ
గదలి వత్తురు రాజ్యకాంక్ష నెల్లుండి. ;
అలనాఁడు శకునితో డైనఁ బాండవుల
గెలిచిన ట్లిప్పుడు గెలుతు కా కేమి !
ఘనతఁ గవ్వడి పాచికలు వేయ రాఁడు
వినుతబాణము లేసి విదళించుఁగాని.
లీల నాచార్యుఁ బల్కి నయట్లు కాదు
తోలి తొప్పఱలాడు దురములోఁ గ్రీడి.
నిలిచి కవ్వడితోడ నీవు మార్కొనఁగ
నెలమిఁ జూచెదఁ గాక యెందుఁ బోయెదను.
అక్కట ప్రియశిష్యుఁ డని ద్రోణుఁ డతని
నొక్కింతఁ బొగడిన నోర్వ లే వైతి!
కిన్నరసురసిద్ధఖేచరు లతని
సన్ను తింతురు మాన్పఁ జాలుదె నీవు ?
అదియును గాక ద్రోణాచార్యుఁ డెపుడుఁ
గదనంబు సేయఁడు, కాక చేసినను
దిక్కులు వ్రక్క లౌధృతిఁ బట్టపగలఁ
జుక్కలు పొడుచు శేషుఁడు మూర్ఛపోవు.