పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము -ఆ -1

అనవుడు విభుఁ జూచి యమరేంద్రసుతుఁడు
మనసులోపల శోకమగ్నుఁ డై పలికె:
"అక్కట ధరణి నీయంతరాజునకు
నొక్క భూపతిఁ గొల్చి యుండంగ వలసె !
కపటం బెఱుంగవు కల నైన నెపుడు,
కృపయు నీతియు వేఱె కీర్తింప నేల ?
మన్నింప నేర్తువు మంచివారలను ;
సన్నుతించుట గాదు సహజంబ నీకు.
ద్రౌపదిఁ బట్టి శా త్రవు లీడ్చునపుడు
కోపింప నేరని గురుశాంతనిధివి;
ఇట్టిపుణ్యుఁడ వింక నేరూపుఁ దాల్చి
నెట్టన రిపులతో నిర్వహించెదవు ? "
అనవుడు నామాట లాలించి వినక
మనసున ధీరుఁ డై మనుజేంద్రుఁ డనియె:
"సన్యాసివేషంబు సమకూర్చికొనుచు
మాన్యుఁడ నై యుందు మత్స్యేశుకడను;
పలుకుదు మృదువుగా బహుపురాణములు;
పొలుపుగా నతనికి బుద్ధి చెప్పుదును ;
జూదంబు తల పెట్టి చూపి యాతనికి
మోదంబు పుట్టింతు; మున్ను నాచేత