పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

215

మనుజులు నాతోడ మత్సరించినను
ఘనభుజాటోపంబుకలిమిఁ జూపుదును.
గంధర్వపతి మొన్న గాంధారిసుతుని
బంధించి కొనిపోవ బలిమిమైఁ దాఁకి
విడిపించి పుచ్చితి వినవె నాలావు ?
ఎడపక మఱియు ననేకముల్ గలవు.
నీ వింక వెఱవకు నిఖిల కౌరవుల
నావ లీవలఁ జేసి హతము గావించి
పన్నగ ధ్వజుమానభంగంబు చేసి
పన్ను గా మరలింతుఁ బసుల నీక్షణమె.”

బృహన్నల యర్జునుఁ డౌట నెఱింగి యతని కుత్తరుఁడు దేరు గడపం బూనుట.



అనిన భూమింజయుఁ డానందబాష్ప
జనితాభిషేకుఁ డైశమి డిగ్గ నుఱికి
సవ్యసాచికిఁ జక్కఁ జాఁగిలి మ్రొక్కి
భవ్యాత్ముఁ డై లేచి భక్తి నిట్లనియె:
"శ్రీకంఠపదపద్మ సేవాధురీణ
ప్రాకటధర్మజప్రాణసంత్రాణ
అర్జున నీవు నన్నాదరించుటకు
నార్జించినాఁడఁ బుణ్యము లనేకములు.