పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపదభారతము.

ఏయొచ్చెమును లేకయే పట్టణములఁ
బాయక ధర్మంబు ప్రబల మై యుండు.
హరులును బసులు ధా న్యము నేయి నీరు
కరులును దోఁటలుఁ గలుగు నెప్పుడును.
కౌరవాధిపుఁ డేలుగజపురంబునకుఁ
జేరువ యని మీరు చింతింప నేల?
ఈపట్టణములలో నెం దైన మనము
భూపాల యుండుట బుద్ధికార్యంబు."
అనవుడు మనుజేంద్రుఁ డమరేంద్రసుతునిఁ
గనుఁగొని తనకోర్కి కానరాఁ బలికె:
" నాకుఁ జూడఁగ మత్స్య నగరంబు మేలు ;
ప్రాకట బహుభోగభాగ్యసంపదలు
వినయభూషణుఁ డైనవిరటుఁ డున్నాఁడు;
మనుజులతారతమ్యము లాతఁ డెఱుఁగు ;
ప్రణుతి కెక్కిన భూమిపతులలోఁ గొంత
గుణవంతుఁ డగువానిఁ గొల్చి యుండుదము.
ఉండుచో నేరూప ముచితంబొ మనకు
నొం డొండ వివరింపు డొనఁగూడి మీరు,
వెలయ నా కిప్పుడు వివరించి చూడఁ
బలుమాఱు మన కైన భ్రమ పుట్ట వలయు "