పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

ద్విపద భారతము.

తమపై వచ్చువాఁ డర్జునుఁ డని ద్రోణుఁడు కురువీరులకుం దెలుపుట.

"అదె వచ్చెఁ బులివలె నమరేంద్రసుతుఁడు
కదుపుల మరలింపఁ గలఁ డింక నితఁడు.
ఎక్క టిపోరాట నీశు నొప్పించెఁ
దక్కినవా రెంత ధర నర్జునునకు ?
ఆఁకలి గొనినసింహము సామజముల
మూఁకపై లంఘింప మోదించినట్లు
వనవాసమున నున్న వంత యంతయును
మనమీఁదఁ బుచ్చక మానునే యితఁడు !
కౌరవసేనలో గాండివిఁ దాఁకు
ధీరుఁ డొక్కఁడు లేఁడు తివిరి చూచినను"
అనుటయు రవిసూనుఁ డాగ్రహం బెత్తి
కనుఁగొని చాపశిక్షకున కిట్లనియె:
"భళిర పాండవపక్ష పాతంబు చేతఁ
బలుమాఱు నీ విట్లు పలవరించెదవు
స్రుక్కక నిజము నిష్ఠూరంబు గాఁగ
నొక్క కందువ గారె నొగి నీవు వారు !
నీ విట్లు ప్రేలిన నిఖిల సేనలకు
భావంబులోపల భయము రెట్టించు.