పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

ద్విపద భారతము.

మహి మాత్స్యగోవుల మరలింపఁ గలను.
సహజవిక్రమ నీవు చాటుగా నుండు"
మని బుద్ధిగాఁ జెప్ప నతఁ డెన్నిగతుల
ననుమతింపక యున్న నమరేంద్రసుతుఁడు
"సారథి వై యుండు చాలు నా" కనుచుఁ
దేరిపై నుత్తరుఁ దెఱఁ గొప్ప నునిచి.
తానును రథికుచందమునఁ దే రెక్కి
సేన చూడఁగ జమ్మిఁ జేరంగఁ బోయి
యందు నిక్షేపించినట్టి కైదువుల
నందుటకును రథ మచ్చోట నిలిపె.
గురుఁ డంత నరుకాంతి గుఱుతుగా నెఱిఁగి
సురనదీసుతుఁ జూచి సొరిది ని ట్లనియె:
"కౌరవసేనలోఁ గలయ నుత్పాత
కారణంబులు తోఁచెఁ గంటిరే మీరు:
దినమణి రుచిఁ బాసె దిగ్ధూమ మెసఁగె
ఘన కేతువు ల్గూలె, కరు లెల్లఁ దూలె
వావురంబులు మ్రొగ్గె, వసుధ గ్రక్కదలె
వావిరి గోమాయువర్గంబు లఱచె"
అని చెప్పి మఱి యతం డర్జునుం డగుట
మనసులో నెఱిఁగి తా మఱువెట్టి పలికె: