పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

199

లే నేల మరలుదు? నీవుఁ బో వలదు.
పూని గోవులు రాక పోరాదు మనకు"
అనుచు వాసవపుత్త్రుఁ డరదంబు గడపఁ
దను దానె బెదరి యుత్తరకుమారుండు

బృహన్నల రథంబు మరల్పమికిఁ గలంగి యుత్తరుఁడు తేరు డిగి పాఱుట.


"అగుఁ దేర కాఁడ వే మనిన ది క్కేది,
తగువాఁడవే చూడ దాయ వై తిపుడు.
పసు లేల, నీ వేల, పలుకు లే" లనుచు
వసుధకు గుప్పించి వాసిఁ బో విడిచి
తల వీడ మొల వీడఁ దనమోము వాడఁ
గలయ సేనలు చూడఁ గడునోడి పాఱె.
అంత నర్జునుఁ డాత్మ నతఁడు పాఱుటయు
నెంతయుఁ జింతించి యెలమిఁ బగ్గములు
నొగలతో ముడిచి తానును డిగ్గ నుఱికి
తగ నుత్తరునివెంటఁ దవిలి పోవుటయుఁ
గురుసేనలోపలఁ గొంద రర్జునునిఁ
బరికించి యాజాను బాహు లౌటయును
గమనలక్షణమును గర్వ రేఖయును
సమరసన్నాహంబుఁ జర్చించి యపుడు