పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము -ఆ -1

గొంతదూరం బేగి కువలయాధిపులు
వింతగా నొకచోట విడిపి నాఁ డుండి
మఱునాఁడు రేపాడి మజ్జనం బాడి
మఱవక సాంధ్యసమాధులు దీర్చి
సుఖ మున్న చోట నర్జునుఁ జూచి విభుఁడు
నిఖిలంబుఁ దలపోసి నెమ్మి ని ట్లనియె:
"ఈయిందువదనతో నెలమి నార్వురము
నీయందమున నున్న నెఱుఁగరే మనల?
పొడచూపఁగా రాదు భువిలోన మనకు.
బడలక యియ్యేడు వర్తించు టరుదు ;
ఎఱిఁగింపు దీనికి నేది కార్యంబు ?
ఎఱుఁగఁ దీఱదు నాకు హృదయంబులోన "
అనవుడు విభుఁ జూచి యాసవ్యసాచి
ఘనభక్తి దీపింపఁగా విన్నవించె:
"రాజేంద్ర , యమధర్మ రాజు నీ కిపుడు
తేజంబుతో నిచ్చె ధృతి నొక్క వరము ;
ఆవరంబునఁ జేసి యనఘాత్మ మనము
ఏవిధంబున నున్న నిఁక నేల వెఱవ !
మనమునఁ బ్రీతియౌ మగధపాంచాల
ఘనమత్స్యకాంభోజకటకంబులందు