పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

195

నరుఁ జూచి పలికిరి "నాఁ డర్జునునకు
నరు దారఁగాను బృహన్నల రథము
నేరీతి నడపి గె ల్పిచ్చితి విపుడు
నారీతి గెలిపింపు మధిపనందనుని."
అని పౌరు లాడుమా టాలించి విరట
తనయుఁ డప్పట్టణద్వారంబు వెడలి
విజయునేర్పున వాయువేగ మై పోవు
నిజరథగతులు వర్ణించి మెచ్చుచును
భీమపిశాచగర్భిత మైనరుద్ర
భూమిఁ జేరఁగఁ బోయి పోయి దవ్వులను

ఉత్తరుఁడు కౌరవసేనం గని భయ మంది బృహన్నలను రధము మరల్ప వేఁడుట.


వీక్షింపఁ గురురాజువిపుల సైన్యంబు
నక్షీణగజయూధ మై యున్న దాని
బహురత్నములు గూర్చి పఱచినయట్లు
బహువర్ణధూళి నభ్రముఁ గప్పుదాని
ఫణితాళసింహాదిపటు కేతనములఁ
బ్రణుతింప మిక్కిలి భాసిల్లుదానిఁ
గుంభ సంభవుఁడు దోకొని పోవు చునికిఁ
గుంభిని యొకదిక్కు క్రుంగించు దాని