పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

ద్విపద భారతము.

శరశరాసనఖడ్గచక్రాదు లందు
నురవడిగాఁ బెట్టు చున్న చోఁ గదిసి
చెలులు నుత్తరయుఁ జెచ్చెరఁ గ్రీడిఁ జూచి
పలికిరి "మీ రింకఁ బరుల నిర్జించి
వచ్చునప్పుడు మీరు వారివస్త్రములు
తెచ్చి మా బొమ్మపొత్తికల కీ వలయు"
అనుటయు వారి కిట్లనియె నర్జునుఁడు
“వినుఁ డుత్తరుఁడు శత్రువితతి నిర్జించి
యమరారఁ జీరల నపుడు కైకొనుచుఁ
గ్రమ మొప్పఁ దెచ్చుట కడిఁదియే నాకు ?
పొనర నన్నడిగినఁ బొల్లు పో రాదు,
వినుతి సేయఁగఁ దెత్తు వివిధాంబరములు"
అనుచుఁ బంతము లాడి యరదంబు నెక్కి
యనువుగాఁ బగ్గంబు లాయత్తపఱచె
ఉత్తరుండును గోవు లొగిఁ బట్టువడ్డ
నెత్తంబు గోపాలనికరంబు నడిగి
వారు చూపినత్రోవ వదలక పోవఁ
దే రెక్కి కదలిన ధృతిఁ బౌరు లపుడు
ముత్తెపుసేపలు ముద మొప్పఁ జల్లి
యు తరు దీవించి రోలి నందఱును.