పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

193

అనిన నుత్తరుమాట కడ్డంబు లాడ
మనసులో వెఱచినమాడ్కి నర్జునుఁడు
ననుమతించుటచేసి యతని కుత్తరుఁడు
ఘనవజ్రకవచంబుఁ గడఁకఁ దెప్పించి
తొడుగు మీ వని వేడ్కతోడ నిచ్చుటయుఁ
దొడుగ నేరనిలాగు దోఁప నర్జునుఁడు
న ట్టిట్టుఁ దొడిగిన నచటి కామినులు
నెట్టన నది చూచి నెఱి నవ్వు చుండఁ
దా వచ్చి తొడిగె నుత్తరుకుమారుండు
దేవేంద్రసుతునిమూర్తికి సంతసిల్లి.
తానును పజ్రాంగి ధరియించి మించి
యానరు వీక్షించి యతఁ డిట్టు లనియె:

బృహన్నల యరదంబు దోల నుత్తరుఁడు పనుల మరల్ప నేగుట.


"మన మింక గోవుల మరలించుపనికి
నొనరంగఁ బో నొప్పు నురియాడ నేల?
పోదము తే రెక్కి పూన్పు గుఱ్ఱముల
నాదట సిడ మెత్తు” మనినఁ గవ్వడియు
వారువంబులఁ దెచ్చి వల నొప్పఁ గట్టి
తేరున సింహాకృతిధ్వజ మెత్తి