పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాట పర్వము--ఆ-4

191

"ఉత్తరునకు మొన్న నొక్కకయ్యమున
నుత్తమగుణజూతుఁ డొకసూతుఁ డీల్గె.
తరువాత సూతవర్తనముఁ జెల్లింప
వెర వరి మఱి లేఁడు వెదకి చూచినను.
అది యటు లుండె నేఁ డఖిల కౌరవులు
మొదవులఁ బట్టిన మొనఁ జక్కఁ బెట్టి
యన్న తాఁ బోయెద నని విచారించి
క్రన్ననఁ దగినసారధి లేక వగవఁ
జూచి సైరంధ్రి నీచొప్పుఁ జెప్పుటయు
నేచిన వేడ్క న న్నిచ్చటికి నతఁడు
నిన్నుఁ డోడ్కొని తేర నెమ్మిఁ బుత్తెంచె.
మన్నించి నీవు నామాటకై రమ్ము"
అనవుడు రమణి కిట్లనియె నర్జునుఁడు :
“వనిత సారథ్యంబువల నే నెఱుంగ ;
నీవు వచ్చితి కాన నీ వేడ్క నాకుఁ
గావింప కుండుట కా దెన్ని గతుల
రయ మొప్పఁ జేయంగ రాని కార్యంబు
నియతిఁ జేయుదు నేను నీమాటకొఱకు"
అనుచు నాటకశాల నర్థితో వెడలి
చను దేరునరుఁ జూచి జననాధసుతుఁడు