పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

ద్విపద భారతము.

"జలజూక్షి యతనితో సారథ్యమునకు
నలు వొప్ప నాబృహన్నల నేర్చు ననుము?
వడి నర్జునుఁడు ఖాండవం బేర్చునపుడు
కడఁగి సారథ్యంబుఁ గావించె ననుము ;
చతురుఁ డై మఱియు వాసవు తేరు గడపె
నితఁడు ముఖ్యుండు నే నెఱుఁగుదు ననుము;
మఱియును వాఁ డేమి మాట లాడినను
విఱుగక ననుఁ బిల్చువిధము గావింపు"
మనుటయు నౌఁగాక యనుచు ద్రౌపదియు
సెనయ నుత్తర యున్న యెడకు ము న్నేగి
యాముగ్ధ కిట్లను "నతివ మీయన్న
వేమాఱు సారథి వెదకు చున్నాఁడు.
అంతకు నేఁ గన్న యంతఁ జెప్పెదను :
చింతింప సారథి సిద్ధించె మనకు ;
అతఁ డెవ్వఁ డనినను నతివ పార్థునకు
నతులితగతి సూతుఁ డైనమీగురువు.
ఈమాట లన్నియు నీవును నేను
భూమింజయునితోడఁ బొసఁగఁ జెప్పుదుము
ర" మ్మని చనుదెంచి రమణీలలామ
యిమ్ముల నృపసూతి కెఱిఁగించె నంత