పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము.

పురుషులలోపలఁ బొడ వైనహరియు
మరువున నొకచోట మరుగుజ్జు గాఁడె?
దుర్వహుం డై తల్లితొడఁ జొచ్చి మున్ను
నౌర్వునంతటివాని కలయంగ వలసె.
అదియు నేటికి ? సూర్యుఁ డాదికాలమున
మొదవుగర్భముఁ జొచ్చి ముమ్మాఱు డాఁగె.
వీ రెల్ల, నటమీఁద వెలయ శాత్రవుల
శూరు లై మర్థించి సుఖ మున్నవారు. .
ఆరీతి మీర లాయాసంబు లోర్చి
వైరులఁ బరిమార్చి వసుధ నేలెదరు.
అని మహీ దేవత లా పాండవులకు
మనసులో నున్న యుమ్మలికంబుఁ బాపి
"క్రమ్మఱ సంపద ల్గలుగు మీ" కనుచు
నెమ్మితో నేగిరి నిజపురంబులకు.
అప్పు డన్నర నాథు లఖిల సేవకులఁ
దప్పక పిలిపించి తగఁ గుస్తరించి
దొరల సామంతుల దుర్గాధిపతుల
వెర వొప్ప నందఱ వేర్వేఱ ననిచి
హరిణాక్షియును దాము నరదంబు లెక్కి
ధరణి నుత్తముఁ డైన ధౌమ్యుఁ దోడ్కొనుచుఁ